హైదరాబాద్, సెప్టెంబర్ 16 :స్పష్టత లేకపోవడం వల్ల..నిధులలేమివల్ల 15 పంచాయతీల విలీనంపై విడుదలైన జీవోను కౌన్సిల్ తిరస్కరిస్తున్నట్టు జిహెచ్ఎంసి మేయర్ మజిద్ సోమవారంనాడు తెలిపారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని 15 గ్రామాలను జిహెచ్ఎంసిలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే నిధుల కొరత వల్ల, జీవోలో స్పష్టత లేకపోవడం వల్ల తిరస్కరిస్తున్నామని మజిద్ వివరించారు.




