కూకట్‌పల్లిలో తెరాస నేతలు అరెస్టు
హైదరాబాద్ : కూకట్‌పల్లి పద్మావతి గార్డెన్స్‌లో సకలజనభేరి సన్నాహక సభ నిర్వహించేందుకు యత్నించిన తెరాస నాయకులను సోలీసులు అరెస్టు చేశారు. అనుమతిలేకుండా సభ నిర్వహించేందుకు ప్రయత్నించడంతో తెరాస నేతలను అరెస్టు చేసినట్లు కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు.



