హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విడుదలకు నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.నిన్న బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్‌యంలో ఇవాళ జగన్ తరపు న్యాయవాదులు కోర్టుకు ష్యూరీటీలను సమర్పించారు.కోర్టు ఆదేశాల ప్రకారం ఇద్దరు ష్యూరీటిలు, రెండు లక్షల దరావత్తు కోర్టుకు చూపించారు.దీంతో కోర్టు జగన్ విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. విడుదల ఉత్తర్వులను జగన్ తరపు న్యాయవాదులు అందుకున్నారు. మరి కాసేపట్లో జగన్ జైలు నుంచి విడుదల కానున్నారు.




