నేడు హజ్‌యాత్ర ప్రారంభం
హైదరాబాద్ : ముస్లింలు పవిత్రంగా భావించే హజ్‌యాత్ర ఈ రోజు ప్రారంభంకానుంది. రాత్రి 8.40గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మక్కాకు తొలి విమానం బయలుదేరనుంది. 300 మంది యాత్రికులు మక్కాకు బయలుదేరనున్నారు. సాయంత్రం 4.30గంటలకు నాంపల్లిలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ హజ్ భవన్‌లో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హాజరవుతారు. విమానశ్రయానికి యాత్రికులను తరలించే బస్సులను సీఎం జెండా వూపి ప్రారంభిస్తారని హజ్ స్పెషల్ ఆఫీసర్ ప్రొపెసర్ ఎస్.ఎ.షుకార్ ,ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ అబ్దుల్లా హమీద్‌లు తెలిపారు.



