మృతదేహంతో ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన

చౌటుప్పల్‌ (నల్గొండ) : నల్గొండ జిల్లా చౌటుప్పల్‌కు చెందిన గర్భిణి చినుకుని సంధ్య (22) స్థానిక ప్రశాంతి నర్సింగ్‌ హోంలో గత కొంతకాలంగా వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. ఇందులో భాగంగా ఇవాళ ఆసుపత్రికి వచ్చిన ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు సూచించారు.సంధ్య ఇంటికి వెళుతూ మార్గ మధ్యలో మృతి చెందింది.సంధ్య మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆగ్రహించిన బంధువులు మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.