విద్యార్థినులకు భద్రతేదీ ?

బోధన్‌ : బాలికల సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో భద్రత కరువైంది. విద్యార్థినుల భద్రత గాలిలో దీపంలా మారింది. హాస్టళ్లలో వాచ్‌మెన్‌లు ,వార్డెన్‌లు స్థానికంగా ఉండకపోవడంతో విద్యార్థినుల భద్రతా ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో విద్యార్ధినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.