అద్దె కార్ల పేరుతో భారీ మోసం
హైదరాబాద్ : అద్దెకార్ల పేరుతో భారీ మోసం జరిగింది.నగరంలోని డేల్టాక్యాబ్స్ బిచాణా ఎత్తేసింది.దీని నిర్వాహకులు సుమారు 700 మంది కస్టమర్లకు రూ.10కోట్ల మేర కుచ్చు టోపి పెట్టినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు డెల్టాక్యాబ్స్ నిర్వాహకులు సాజిద్, అహ్మద్‌లను పోలీసులు అరెస్టు చేశారు.



