Tuesday, 3 November 2026

తెలంగాణ టీడీపీ నేతల్ని తరిమికొట్టాలి : టీఆర్‌ఎస్‌ నేత జగదీశ్‌రెడ్డి

నల్లగొండ : సిగ్గులేకుండా చంద్రబాబుకు వంతపాడుతున్న తెలంగాణ టీడీపీ నేతలను తరిమికొట్టాలని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు.చంద్రబాబు గోడమీది పిల్లిలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌పై కిరికిరి పెడితే ఊరుకోమని హెచ్చరించారు.ప్రస్తుతం తెలంగాణ సమాజం నివురుగప్పిన నిప్పులా ఉందన్నారు.కేసీఆర్‌ పిలుపు కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *