విద్యుత్ డైరెక్టర్ వయో పరిమితి కుదింపు
హైదరాబాద్ : విద్యుత్‌రంగంలో డైరెక్టర్ల భర్తీకి సంబందించి అభ్యర్ధుల వయోపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం సవరించింది.విద్యుత్ డైరెక్టర్ల వయోపరిమితిని 65 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు కుదిస్తూ ఇంధన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇకపై 62 సంవత్సరాలు దాటిన వారు విద్యుత్‌రంగంలో డైరెక్టర్లుగా కొనసాగేందుకు అనర్హులవుతారు.ప్రస్తుతం పనిచేస్తున్న వారికి కూడా సవరణలు వర్తించనున్నాయి.



