చిన్నారి పొట్టతిప్పలు

ఆకలితీర్చుకునేందుకు చిన్నారి పడుతున్న బతుకు బాధ చిత్రం
ఇదేదో మాయ కాదు.. మంత్రం కాదు.ఆకలి తీర్చుకునే పోరాటంలో బాల్యాన్నీ మొగ్గలోనే చిదిమేస్తున్న సజీవ సాక్ష్యం
వీక్షకుల వొళ్లు జలదరించేలా పదేళ్ల వయసు గల ఈ చిన్నారి గొంతుపై ఇతడు చేస్తున్న ఈ విన్యాసం హైదరాబాద్‌లో జరిగింది. కన్నవారి కడుపు నింపేందుకు ఆ బాలిక అనంతమైన బాధను గొంతులోనే అణుచుకుంటున్న దృశ్యాన్ని చూసిన వారెవరైనా చలించిపోవాల్సిందే.ఆ చిన్నారికి ఎందుకంత కష్టం అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.పాలకుల నిర్లక్ష్యం కొనసాగుతున్నంత కాలం ఇలాంటి వారి కష్టాలు తీరవనడానికి ఇదే ప్రబల సాక్ష్యం