Tuesday, 3 November 2026

సీఎం కిరణ్‌ ఆజ్ఞాని : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌


హైదరాబాద్‌ : రాష్ట్ర విభజన జరుగకూడదని, తాను సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ఉండాలని కోరుకుంటానని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిన్నటి ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ఇవాళ ఆయన టీఆర్‌ఎస్‌ భవన్‌లో జరిగిన విలేరుల సమావేశంలో మాట్లాడారు.తెలంగాణకు జరుగుతున్న నష్టాల గురించి సీఎ కిరణ్‌కు తెలియవా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.సీఎం కిరణ్‌ అజ్ఞానంతో మాట్లాడుతున్నాడని విమర్శించారు.ఆయన ఉద్దేశ్యం సీమాంధ్ర పండాలి.తెలంగాణ ఎండాలి అనేలా ఉందని అది అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని చెప్పినప్పుడే స్పష్టమైందని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *