Tuesday, 3 November 2026

జనభేరికి ఆంక్షలు విధిస్తే సహించం


మా సహనాన్ని పరీక్షించొద్దు
జగన్‌ ఊరేగింపుకు ఎలా అనుమతించారు : కోదండరామ్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) :
సకల జన భేరికి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే సహించబోమని టీ-జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదం డరాం హెచ్చరించారు. సకల జన భేరీ విజయవంతం చేసే అంశంపై శుక్రవారం జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ సకల జన భేరికి లక్షలాదిగా తరలివచ్చి తెలంగాణ ఆకాం క్షను చాటాలని పిలుపునిచ్చారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ తమకు కావాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ విషయంలో మెలికలు, పరిమితులు పెడితే అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభు త్వం తెలంగాణ ప్రక్రియను మొదలుపెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రకటన చేసి దాదాపు 60 రోజులు అవుతున్నా.. ప్రక్రియ ముందుకు వెళ్లకపోవడంపై అనుమా నాలు వ్యక్తమవు తున్నాయని తెలిపారు. సీమాంధ్రుల ఒత్తిడి తగ్గి వెనక్కు పోతే ఊహించని రీతిలో ఉద్యమం ఉంటుందని హెచ్చరించారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప తమకు మరే ప్రత్యామ్నయం అక్కర్లేదన్నారు. ఈ నెల 29న తెలంగాణ వాదులంతా హైదరాబాద్‌కు తరలిరావాలని కోరారు. నిజాం కళాశాలలో జరిగే సకల జన భేరీకి తెలంగాణ వాదులు లక్షలాదిగా తరలిరావాలని కోరారు. సకల జన భేరి సదస్సు ప్రాంగణానికి కాళోజీ ప్రాంగణంగా, సదస్సు నిర్వహించే వేదికకకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వేదికగా నామకరణం చేసినట్లు చెప్పారు. సదస్సు వచ్చే రెండు ద్వారాలకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ, సదాలక్ష్మి ద్వారాలుగా నామకరణం చేశామన్నారు. ప్రభుత్వం సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. జగన్‌ జైలు నుంచి విడదలై వేలాది మందితో ర్యాలీ చేస్తే ప్రభుత్వం అనుమతించిందని, జగన్‌ ర్యాలీకి అనుమతించిన ప్రభుత్వం తాము ర్యాలీలు చేస్తామంటే అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. సకల జన భేరీని అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సీమాంధ్ర పక్షపాతి అయిన డీజీపీ దినేశ్‌రెడ్డి పదవీ కాలాన్ని పొడిగించొద్దని ఆయన డిమాండ్‌ చేశారు. దినేశ్‌రెడ్డికి కొనసాగే అర్హత లేదని, ఉన్నత న్యాయస్థానానికి వెళ్లైనా అడ్డుకుంటామన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మాకులకు దసరా బోనస్‌ ఇవ్వాల్సిందేనన్నారు. ఆర్టీసీ కార్మికుల బోనస్‌ డిమాండ్‌కు టీ-జేఏసీ సంపూర్ణ మద్దతిస్తుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *