స్కౌట్స్ & గైడ్స్ ఆద్వర్యంలో భారతీయ వంటకాలు
హైదరాబాద్ : భారత స్కౌట్స్ & గైడ్స్ ఆద్వర్యంలో నేషనల్ ఇంటిగ్రెషన్ క్యాంపు దేశ సమగ్రతను చాటేలా కొనసాగుతుంది.దాదాపు 20 రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఒక్కోరోజు ఒక్కో అంశాన్ని ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు.శనివారం ఆయా రాష్ట్రాల్లోని వంటకాలను పరిచయం చేశారు.ఏ హోటల్‌కు వెళ్లినా ఇన్ని రకాల పదార్థాల్ని ఒకే చోట చూడలేం. దాదాపు దేశంలోని అన్ని రకాలు ఇక్కడ ఘమఘమలాడాయి. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల బాలబాలికలు వారి సాంప్రదాయ పదార్థాలు చేసి ప్రదర్శించారు.



