Monday, 2 November 2026

కంద్రంపై ఒత్తిడి తేవాలని సుష్మస్వరాజ్‌ ను విజ్ఞప్తి చేశాం : కొదండరాం

హైదరాబాద్‌ : తెలంగాణ విభజన ప్రక్రియ వేగవంతం చేయడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని భాజపా అగ్రనేత సుష్మస్వరాజ్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కొదండరాం తెలిపారు. శంషాబాద్‌లోని హోటల్‌ నోవాటెల్‌లో సుష్మాస్వరాజ్‌ను కలిసిన అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు భాజపా అందించిన సహకారానికి కృతజ్ఞతగా సుష్మాస్వరాజ్‌ను కలిసినట్లు చెప్పారు.కాంగ్రెస్‌ తెలంగాణ ఏర్పాటు ప్రకటన వెనుక భాజపా కృషి కూడా ఉందని కోదండరాం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *