
చిక్కడపల్లి (హైదరాబాద్) : చిక్కడపల్లి :మానవత్వాన్ని మంట గలిపాడు.వావివరసలు,కుటుంబ సంస్కృతిని కాలరాశారు. జనారణ్యంలో నివసించే మానవ మృగాలు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించి అతి ఘోరానికి ఒడికట్టారు.భర్త ,అత్తమామలు కలిసి జంతువును బలిచ్చినట్లు కోడలి గొంతుకోసి మారణహోమం సృష్టించారు.
సెంట్రల్ జోన్ డీసీపీ కమలాకర్‌రెడ్డి ,మృతురాలి ,బంధువుల కథనం ప్రకారం ..బాగ్‌లింగంపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత జి.చిత్తరంజన్ (60) అచ్చయ్యనగర్ బృందావన్‌కాలనీ శాంతినిలయం అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు.ఇతని కుమారుడు బాలకృష్ణకు మేడ్చల్‌కు చెందిన రజనితో పదేళ్ల క్రితం పెళ్లైంది.వీరికి కూతురు నిరుపమ ఉంది.భర్త క్వారీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను కొంతకాలంగా తన సహోద్యోగితో వివాహేతర సంబందం పెట్టుకుని భార్యను నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీన్ని ఆసరాగా చేసుకుని కామాంధుడైన మామ చిత్తరంజన్ తన కోరిక తీర్చమని ఏడాదిగా రజనిని వేధిస్తున్నాడు.తిరస్కరించిన ఆమెపై కక్ష్య గట్టాడు. రజని విషయాన్ని భర్తకు చెప్పగా తండ్రిని నిలదీయకపోగా తన తండ్రి కోరిక తీరిస్తే తప్పులేదన్నట్లు మాట్లాడాడు. దీంతో మనోవేదనకు గురైన రజని ఈ విషయాన్ని తల్లి మీరాభాయికి చెప్పి … ఇక్కడుండలేనని ఇంటికి వస్తానని రోదించింది. దీంతో తల్లి ఆదివారం వచ్చి తీసుకెళ్తానని నచ్చచెప్పింది.
పథకం ప్రకారం హత్య…
కోడలిపై కక్ష్యగట్టిన అత్తమామలు ,భర్త రజనిహత్యకు పథకం వేశారు.శనివారం తెల్లవారుజామున 3గంటలకు ఆమె గదిలక వెళ్లారు.గాఢనిద్రలో ఉన్న రజని పొట్టపై మామ కూర్చుని కదలకుండా పట్టుకోగా ..భర్త బాలకృష్ణ కత్తితో గొంతు కోసి దారుణంగా చంపేశాడు. అత్త కూడా వారికి సహకరించింది.
కోరిక తీర్చలేదని కోడలిని హతమార్చిన మామ




