ఇన్‌ఛార్జీ డీజీపీగా ప్రసాదరావు నియామకం

హైదరాబాద్‌ : ఇన్‌ఛార్జీ డీజీపీగా బయ్యారపు ప్రసాదరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పూర్తికాల డీజీపీ కోసం యూపిఎస్సీ నుంచి నియామక ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. అప్పటివరకు ఆయన ఇన్‌చార్జీ డీజీపీగా భాద్యతలు నిర్వహిస్తారు. 1979 బ్యాచ్‌కు చెందిన ప్రసాదరావు ఇప్పటివరకు అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేశారు. ఆయన పదవి విరమణకు మరో రెండేళ్లు సమయం ఉంది.

తాజావార్తలు