డీజీపీ రేసులో ఆరుగురు ఐపీఎస్‌లు
హైదరాబాద్ : డీజీపీ రేసులో ఆరుగురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఈ పదవిలో ఎవరిని నియమించాలనే దానిపై ప్రభుత్వం ఇవాళ యూపీఎస్సీకి ఆరుగురు అధికారుల పేర్లతో కూడిన జాబితాను పంపనుంది. ఈ ప్యానెల్‌లో టీపి దాస్,అరుణబహుగుణ , ప్రసాదరావు, హుడా ,ఏకేఖాన్, జేవి రాముడుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. యూపీఎకు జాబితాను పంపనందునే ప్రసాదరావుకు అదనపు బాధ్యతలు అప్పగించనట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి.



