అల్పపీడన ప్రభావంతో తెలంగాణకు భారీ వర్షసూచన
హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం సెంట్రల్ మధ్యప్రధేశ్ పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతుంది.దీనికి అనుబందంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.



