నేటినుంచే తెలంగాణలో బతుకమ్మ బతుకమ్మ పండుగ
హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతిని ,పల్లెజీవనాన్ని పాటలతో చాటిచెప్పే ప్రకృతి పండగ బతుకమ్మ శుక్రవారం మొదలవుతుంది. సాంస్కృతిక అస్థిత్వం నిలుపుకునే క్రమంలో తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మకు ప్రాధాన్యం ఏటేటా పెరుగుతుంది. బతుకమ్మ బీళ్లు బీళ్లుగా విస్తరించుకున్న నీళ్లులేని తెలంగాణలో ఆర్భాటపు పండుగ.ప్రపంచంలో ఎక్కడాలేని పూల పట్టాభిషేక పండుగ.బతుకమ్మ చిన్నపిల్లలు ,కన్నెపిల్లలు ఆడుకునే బొడ్డెమ్మల దగ్గరినుంచి ,పెత్తరామాసను కలుపుకుని పెద్దలు ఆడుకునే బతుకమ్మ వరకు ఇరవై రోజుల పండుగ. బతుకమ్మ అంటే పాటల వలపోత. మాటల వడపోత. సెప్టెంబర్ ,అక్టోబర్ మాసాల్లో తెలంగాణలో వ్యవసాయ పనులు పూర్తై తీరిగ్గా ఉండే సమయం . బతుకమ్మ పండుగకు పెళ్లైనా ఆడబిడ్డను అత్తవారింట్లో సమస్యలతో సతమయ్యే బిడ్డను పుట్టింటికి తీసుకొచ్చి సేదతీరుస్తారు. బతుకమ్మ పండుగ స్త్రీల పెద్ద పండుగ.




