హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షుడి ఆస్తులకే రక్షణ లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఎంపీ వి. హనుమంతరావు ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే ఇది మా ప్రభుత్వమేనా అని అనుమానం కలుగుతుందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాబు ఏం మాట్లా డుతున్నారో అర్ధం కావడం లేదని తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే అడ్డుకంటున్నారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అశోక్బాబు నియంతలా మాట్లాడుతున్నాడని వీహెచ్ ఎద్దేవా చేశారు.




