రౖలు పట్టాలపై యువకుల మృతదేహాలు
విశాఖపట్నం : జిల్లాలోని పెందుర్తి రైల్వేస్టేషన్ దక్షిణ క్యాబిన్ సమీపంలో రైలు పట్టాలపై ఇద్దరు గుర్తు తెలియని యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనాస్థలంలో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌కు చెందిన ద్విచక్రవాహనం ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు వీరిని హతమార్చి రైలుపట్టాలపై పడేసి ఉంటారని భావిస్తున్నారు.



