హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర కేబినేట్ తెలంగాణ నోట్‌ను ఆమోదించిన తరువాత దానిని అడ్డుకోవడానికి ఢిల్లీలో దీక్ష డ్రామాలాడుతున్నాడని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యె తన్నీరు హరీష్‌రావు పైర్ అయ్యారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు దీక్ష దేనికోసం అని ప్రశ్నించారు. ఇక్కడ తెలంగాణకు అనుకూలమంటూనే, ఆంధ్రకు పోయి రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలంటాడు. అసలు ఒక నాయకుడు మాట్లాడే తీరు ఇదేనా ? అని ఆయన ప్రశ్నించారు. విభజనపై ఏదో మాట్లాడాలేగాని, అటుఇటు గాకుండా మాట్లాడుతున్నాడని అన్నారు. ఊసరవెల్లుల సంఘానికి అధ్యక్షుడిగా బాబు వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలతో ప్రజలు ఇటు ఆయన పార్టీ కార్యకర్తలు అయోమయంలో పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు ఢిల్లీలో దీక్ష దేనికి తెలంగాణకా , సమైక్యం కోసమా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. మాట తప్పడంలో మడమ తిప్పడంలో చంద్రబాబుకు డాక్టరేట్ ఇవ్వచ్చని ఆయన వ్యాఖ్యానించారు.ఆనాడు తెలంగాణకు అనుకూలమని కేసీఆర్ పక్కనే కూర్చుని చెప్పాడని నేడు కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోగానే దొంగ దీక్షలతో అడ్డుకోవాలని చూస్తున్నాడని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
తెలంగాణను అడ్డుకోవడానికే చంద్రబాబు దీక్ష డ్రామాలాడుతున్నాడు : హరీష్‌రావు





