హౖదరాబాద్‌పై సర్వహక్కులు తెలంగాణ వారివే : ఆంక్షలు పెడితే ఊరుకోం : కేటీఆర్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ కేంద్రం పరిధిలో ఉంటుందన్న దిగ్విజయ్‌ వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ ఖండించింది. కేంద్రం హైదరాబాద్‌పై ఆంక్షలు పెట్టి కిరికిరి చేయాలని చూస్తోందని దీనికి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలే భాద్యత వహించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ హెచ్చరించారు. కేవలం కొద్దిమంది అక్రమ సీమాంధ్ర పెట్టుబడిదారుల పరిరక్షణ కొరకే హైదరాబాద్‌పై ఆంక్షలు అని కేటీఆర్‌ ఆరోపించారు. ఉద్యమం పేరుతో విద్యుత్‌ జేఏసీ సమ్మెకు పోతుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని కేటీఆర్‌ ప్రశ్నించారు.