కేంద్ర పరిధిలో హైదరాబాద్‌ అంటే మళ్లి ఉద్యమిస్తాం : హైదరాబాద్‌పై పూర్తి అధికారాలు మావే : హరీష్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ను గవర్నర్‌, కేంద్ర పరిధిలో ఉంచడమనేది కుట్రేనని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టీ, హరీష్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌పై అధికారం లేని తెలంగాణను ప్రజలు ఒప్పుకోరని ఆయన చెప్పారు. సీమాంధ్రలో ఉన్న తెలంగాణ ఉద్యోగులపై దాడులు జరుగుతున్నందున వారిని తెలంగాణకు బదిలీ చేయాలని ఆయన కోరారు. ప్రైవేట్‌ సీడ్స్‌ కంపెనీలు లాభాలు సాధిస్తుంటే ప్రభుత్వ సీడ్‌ కార్పొరేషన్‌ ఎందుకు లాభాలు సాధించడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వచ్చినంక తెలంగాణ సీడ్‌ కార్పొరేషన్‌ అభివృద్ది చేస్తామని ఆయన వివరించారు. ఇప్పటికి తెలంగాణలో శుద్ది చేసిన విత్తనాలు దేశంలో 70 శాతం సరఫరా అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని ,ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పిన సీఎం కిరణ్‌ చిత్తూరు జిల్లాకు వేలాది కోట్ల నిధులు మంజూరు చేసిండని ,తెలంగాణలో 10 జిల్లాల్లో 3 మెడికల్‌ కాలేజీలు ఉంటే 4 జిల్లాల రాయలసీమలో 4 మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని ఆయన వివరించారు. హైదరాబాద్‌లో ఉమెన్స్‌ కాలేజీ ఏర్పాటు చేయకుండా తిరుపతిలో రూ. 15 కోట్లతో మెడికల్‌ కాలేజీ ఎట్లా ఏర్పాటు చేస్తడని హరీష్‌ ప్రశ్నించారు.

తాజావార్తలు