కెరన్ సెక్టార్‌లో ఆపరేషన్ నిలిపివేత
జమ్మూ కాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లోని కెరన్ సెక్టార్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ను నిలిపివేసినట్లు సైనికాధికారి ప్రకటించారు. సెప్టెంబరు 24 నుంచి ఇక్కడ చొరబాటుకు యత్నించిన 40 మంది ఉక్రగవాదులకు, సైన్యానికి మధ్య కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ్టితో ఇది ముగిసిందని, ఈ ఆపరేషన్లో ఏడుగురు ఉగ్రవాదులు మరణించారని,ఆరుగురు జవాన్లు గాయపడ్డారని ఆర్మిచీఫ్ విక్రమ్ సింగ్ తెలిపారు. ఉగ్రవాదుల చొరబాటు యత్నం వెనుక పాక్ సైన్యం ఉన్నట్లు తమ దగ్గర సాక్ష్యాలున్నాయన్నారు. చలికాలం లోపల సాధ్యమైనంత మందిని భారత్‌లోకి ప్రవేశపెట్టాలన్నది వారి ఆలోచన అని ఆయన పేర్కోన్నారు. పాక్ సైన్యం ప్రమేయం లేకుండా ఉగ్రవాదుల ఇంత పెద్ద బృందం చొచ్చుకువచ్చే ప్రయత్నం చేయడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.



