తెలంగాణ పై వెనక్కి వెళ్లడం అసాధ్యం: దిగ్విజయ్
న్యూఢిల్లీ: సీమాంధ్రలో ఉద్యోగులు ఉద్యమాన్ని వెంటనే విరమించాలని మరోసారి కోరుతున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. విద్యుత్ లేకపోవడంతో ఆసుపత్రిలో రోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమ్మెతో తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. అన్ని పార్టీలు లిఖిత పూర్వకంగా అంగీకరించిన తర్వాతే తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకున్నామని దిగ్విజయ్ మరోసారి పునరుద్ఘాటించారు. తెలంగాణ అంశంపై ఇప్పుడు వెనక్కి వెళ్లడం అసాధ్యమని స్పష్టం చేశారు.



