Monday, 2 November 2026

జనవరి 7న హైదరాబాద్‌లో మహాధర్నా : కోదండరాం

హైదరాబాద్‌ : జనవరి 7న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తెలిపారు. మంగళవారం ఉదయం ఐకాస కార్యాలయం వద్ద కోదండరాం మీడియాతో మాట్లాడుతూ…శాసన సభ సజావుగా సాగేలా సభ్యులు సహకరించాలని కోదండరాం విఙ్ఞప్తి చేశవారు. సంపూర్ణ తెలంగాణ కోసం బిల్లులో అవసరమైన సవరణలు తేవాలని సూచించారు. జనవరి 5న దోమలగూడలో ఏవీ కళాశాలలో తెలంగాణ న్యాయవాదుల సదస్సు నిర్వహించనున్నట్లు కోదండరాం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *