Wednesday, 4 November 2026

రూ.7లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత

చేజెర్ల: నెల్లూరు జిల్లా పెంచెలకోన అడవుల నుంచి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న వహనాన్ని రాపూర్‌రేంజ్‌ అటవీఅధికారులు ఆదివారం ఉదయం స్వాదీనం చేసుకున్నారు. ఓటెంపో వాహనంలో తరలిస్తున్న 25దుంగలను, వాహనాన్ని అటవీశాఖ సెక్షన్‌ అధికారి వేదయ్య బృందం స్వాధీనం చేసుకుంది. ముందస్తు సమాచారం తెలలుసుకున్న అధికారులు కలువాయి మండలం చింతల ఆత్మకూరు వద్ద వాహనాన్ని అడ్డగించడంతో స్మగ్లర్లు వాహనం వదిలి పరారయ్యారు. వాహనాన్ని దుంగలను ఆదూరుపల్లి అటవీశాఖ ఠాణాకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *