70ఏండ్లలో కాంగ్రెస్ చేయని పనిని..7ఏండ్లలో కేసీఆర్ చేసి చూపించారు
గుజరాత్ మారణహోమం ఘటలో నాడు కాంగ్రెస్ కఠిన నిర్ణయాలు తీసుకుంటే నేడు దేశం ఇలాంటి విపత్కర పరిస్థితి ఉండేది కాదు
రాజాసింగ్ పై పిడి యాక్ట్ పెట్టడం మతతత్వ శక్తులకు చెంపపెట్టు లాంటిది
ఏ మతాన్నైనా..ప్రవక్తలపైనా.. అనుచిత వ్యాఖ్యలు చేసే ఎవరికైనా రాజాసింగ్ ఘటనే నిలువుటద్దం
అందుకే సీఎం కేసీఆర్ సెక్యులర్ నాయకత్వం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి అత్యవసరం
కరీంనగర్ ముస్లిం సమాజం పక్షాన సీఎం కేసీఆర్ కు..పోలీసు శాఖకు కృతజ్ఞతలు
ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్ వ్యాఖ్యలు
కరీంనగర్, ఆగస్టు 26:-
బిజెపి బూచిని చూపిస్తూ, ముస్లింలను భయపెడుతూ, గత 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏలిందని, కాంగ్రెస్ పార్టీ నాడు తీసుకున్న తప్పుడు విధానాలు, నిర్ణయాలకు, ప్రస్తుతం ప్రాయశ్చిత్తం చెల్లిస్తోందని, గోద్ర అల్లర్ల కేసులో, గుజరాత్లో ముస్లింలపై జరిగిన మారణ హోమంపై, ఆనాడు 2004 నుండి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మత కల్లోలాలు సృష్టించిన బాధ్యులపై, నాటి గుజరాత్ బిజెపి ప్రభుత్వం పై కఠిన చర్యలు తీసుకుంటే.. ఈరోజు బిజెపి చేతిలో భారతదేశం చతికిలబడి పోయేది కాదని, దేశంలో గుజరాతీయుల ఆధిపత్యం ఉండేదికాదని, అందుకే ఇప్పుడు కాంగ్రెస్ మూల్యం చెల్లిస్తోందని, స్వాతంత్ర్యం అనంతరం నుండి గత 70 ఏళ్లలో దేశాన్ని ఏలిన ప్రధానులు, రాష్ట్రాలను పాలించిన ముఖ్యమంత్రులు తీసుకొని సాహసోపేత నిర్ణయం, వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ పెట్టి, సీఎం కేసీఆర్ దేశంలోనే అత్యంత శక్తివంతమైన, డైనమిక్ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచారని తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడు, ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ ను కలిసిన అనంతరం గులాం అహ్మద్ మాట్లాడారు. కరీంనగర్ ముస్లిం సమాజం పక్షాన సీఎం కేసీఆర్ కు, తెలంగాణ పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుందని, ప్రశాంతమైనటువంటి వాతావరణం చెడగొట్టాలని, మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో.. హైదరాబాద్ నగరంతో ముడిపెట్టి మత కల్లోలాలు సృష్టించి, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక వర్గాన్ని కించపరిచి, మరో వర్గాన్ని ఆకాశానికి ఎత్తడం కోసం, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కనుసన్నల్లో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సారథ్యంలో రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నాలు, కుట్రలు జరుగుతున్నాయని, అందులో భాగమే రాజసింగ్ ఘటన పరిణామాలు, మహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యల పరిణామాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఏ మత మయినా, ఏ కులమైన, మనుషులు తినే ఆహారం పైన అనుచితంగా కించపరిచే వ్యాఖ్యలు ఎవరు చేసిన, వారికి రాజాసింగ్ లాంటి శిక్షలు ఉదాహరణ అని చెప్పారు. ఎమ్మెల్యే అయినా, సామాన్యులకైనా, ఒకే రకమైనటువంటి సమన్యాయం, సమ భావన ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలనే దృఢ సంకల్పంతో, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దేశంలో అత్యంత సాహసోపేతమైన నిర్ణయం అని కొనియాడారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్, పోలీసు కమిషనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నగరంలో పోలీసు శాఖ శాంతిభద్రతల పరిరక్షణ కోసం చేసిన కృషి ఆమోఘమని ముస్లిం సమాజం పక్షాన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎంఐఎం అధినేత, బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ, ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి సెక్యులర్ భావాలు గల నేతలు, వారూ తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు యావత్తు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నేత శంకర్ రెడ్డి, ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, ఎంఐఎం లీగల్ అడ్వయిజర్, న్యాయవాది, కొండాడి సుధాకర్ రావు, ఫసి అహ్మద్ ఖాన్ తదితరులు ఉన్నారు.