నటుడు శ్రీహరికి ప్రముఖుల నివాళులు
హైదరాబాద్ : ప్రముఖ నటుడు ,రియల్‌స్టార్ శ్రీహరికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఇవాళ శ్రీహరి పార్ధీవదేహాన్ని ముంబై నుంచి, హైదరాబాద్‌లోని ఆయన సొంత నివాసానికి తీసుకువచ్చారు. శ్రీహరి మృతదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ,మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఇంకా పలువురు సినీ ప్రముఖులు ,శ్రీహరి అభిమానులు ఆయనకు నివాళులర్పించారు.



