హైదరాబాద్ : పదో తరగతి పరీక్ష ఫీజు గడువును పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 28 వరకు గడువును పెంచారు. నవంబర్ 11 వరకు రూ. 50, ఆలస్య రుసుముతో ,25 వరకు ,రూ. 200 ,డిసెంబర్ 9 వరకు రూ. 500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్చించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ మన్మదరెడ్డి ప్రకటించారు.




