తిరుమల : తిరుమల తిరుపతి దేవస్ధానంలో మరో కుంభకోణం వెలుగు చూసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భక్తులు వినియోగించిన టికెట్లను కౌంటర్ ద్వారా తిరిగి విక్రయిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. సీసీ కెమెరా ఆపరేటర్ చైతన్యకుమార్ సహా ముగ్గురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ టిక్కెట్లు విక్రయం 10 రోజులుగా సాగుతంది.




