నేడు మంత్రుల బృందం సమావేశం
నివేదికలు సిద్ధం
పంపకాల చిట్టాపై చర్చలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 18 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం శనివారం రెండో సారి సమావేశం కానుంది. ఇందుకు సంబంధించిన నివేదికలు రాష్ట్రం నుంచి ఇప్పటికే తెప్పించుకుంది. ఆస్తు లు, అప్పులు, విద్యుత్, ఇతర కేటాయింపులు, పంపకాల చిట్టాపై మంత్రుల బృందం చర్చించనుంది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను జెట్ స్పీడ్తో ముందుకు తీసుకెళ్తోన్న కేంద్రం ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఏర్పడే సమస్యలు, సర్దుబాట్లపై దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్రంలోని 11 శాఖలకు సంబంధించిన సమాచారాన్ని 24 గంటల్లో ఢిల్లీకి పంపాలని ఆదేశాలు జారీ చేయడంతో 11 మంది ఐఏఎస్ అధికారులు, ఇద్దరు డీఐజీలు నివేది కలతో సహా శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. కార్మిక సంక్షేమం, ఆర్థిక, రెవెన్యూ, విద్యుత్, వైద్య, విద్యా రంగాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్ప టికే నివేదిక రూపంలో తయారు చేసినట్టు సమాచారం. తెలంగాణలోని రెవెన్యూ డివిజన్లు, మండలాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా తీసుకురావాల్సిందిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీం తో సమాచారం అంతా 24 గంటల్లో అధికారులు నివేదిక రూపంలో రూపొందించి ఢిల్లీకి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఏపీఎ న్జీఓల సమ్మె విరమణ, కేంద్ర, రాష్ట్ర మంత్రుల ప్రజా ప్రతినిధుల వ్యవహార శైలిలో మార్పు రావడం, సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకే జీపై దృష్టి పెట్టడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయిం చింది. పరిస్థితులు సద్దుమణిగిన సమయంలోనే ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో కేంద్రం చకచక పావులు కదుపు తోంది. మూడు వారాల్లో కేంద్ర మంత్రుల కమిటీ తమ నివేది కను ప్రభుత్వానికి సమర్పించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే విద్యుత్ శాఖకు చెందిన నివేదిక దాదాపుగా తయారైన ట్టు సమాచారం. మూడు ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాటిలో తయారయ్యే విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలకు సంబంధించిన వివరాలన్నీంటినీ విద్యుత్ శాఖ మంత్రుల కమి టీకి సమర్పించింది. థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంబం ధించిన అన్ని వివరాలను పంపించేసింది. వివిధ ప్రాం తాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య తెలంగాణ, సీమాంధ్రలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల సంఖ్యను కూడా రాష్ట్రం ప్రభుత్వం సేకరించింది. అదే విధంగా కేంద్ర మంత్రుల కమిటీ మూడు వారాల్లో నివేదిక ఇస్తే వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ దిశగానే రెండో విడత సమావేశంలో పలు కీలక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరుపనుంది. అలాగే సీమాంధ్ర ప్రాంతంలో కొత్త రాజధాని ఏర్పాటు, సీమాంధ్ర ప్రాంతానికి ప్యాకేజీ ఎంత ఇవ్వాలి తదితర అంశాలపై కూడా చర్చించనుంది. సీమాంధ్ర ప్రాంత ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని వారి హక్కులను సైతం పరిరక్షిస్తామని మంత్రుల బృందం ఇటీవలె పేర్కొంది. ఈ నేపథ్యంలో మంత్రుల బృందం రెండో విడత సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.