హైదరాబాద్ : రాష్ట్రంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు.ఈ రోజు ఉదయం 7 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని డొంకూరు గ్రామంలో తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలను ఏరియల్ సర్వే సర్వే ద్వారా పరిశీలించనున్నారు. అనంతరం పునరావాస కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.




