Tuesday, 3 November 2026

ఎల్లారెడ్డి ఎస్‌బీఐలో చోరికి దుండగుల విఫల యత్నం

నిజామాబాద్‌ : జిల్లాలోని ఎల్లారెడ్డి ఎస్‌బీఐ శాఖలో దొంగలు చోరికి విఫల యత్నం చేశారు. బ్యాంకు వెనుక ఉన్న కిటికి తొలగించి లోపలికి ప్రవేశించారు. బ్యాంకు లాకర్లు పగులగొట్టేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. బ్యాంకు అలారం మోగడంతో మేనేజర్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి బ్యాంకు ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *