హైదరాబాద్ : ఉత్తరాంధ్ర ప్రజలు తమ ఇలవేల్పుగా కొలిచే పైడితల్లి అమ్మవారి జాతరకు దేవాదాయ ,ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రత్యేక అధికారి ఎస్.వి.ఎస్.మూర్తి అన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సిరిమాను ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. అమ్మవారి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు.




