హైదరాబాద్ : రాష్ట్ర విభజన అనివార్యమైన నేపథ్యంలో ఇక గాంధీభవన్ తెలంగాణ కాంగ్రెస్ దేనని కేఆర్ .ఆమోస్ తెలిపారు. తెలంగాణ పీసీసీ కావాలని చాలాకాలం నుంచి కోరుతున్నామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్ వల్లే వస్తుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఆవశ్యకత చాలా ఉందన్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేక తెలంగాణ పీసీసీ కావాలని కాంగ్రెస్ అధిష్టానానికి విన్నవించామన్నారు.రాష్ట్రం సమైక్యంగా ఉంటుదన్న విజయవాడ ఎంపీ. లగడపాటి రాజగోపాల్ గుంటూరు- ప్రకాశం మద్య వేయి ఎకరాలు ఎందుకు కొన్నారని ఆమోస్ గతంలో ప్రశ్నించిన సంగతి తెలిసిందే.




