శివరాజ్‌ అవ్‌ ను నిలిపివేయాలి : కాంగ్రెస్‌

ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపధ్యంలో శివరాజ్‌ ఆవ్‌ ను నిలిపివేయాలని మద్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. మద్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ పేరుతో శివరాజ్‌ అప్‌ , భాజపా ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ పేరుతో మోడి రన్‌ అనే అప్లికేషన్లు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి నరేంద్ర సులాజా ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేశారు. శివరాజ్‌అప్‌ పాటల ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు పార్టీ గుర్తు తామర పువ్వు ,ముఖ్యమంత్రి చిత్రాలు ఉన్నాయని తెలిపారు.