హైదరాబాద్ : ఫార్మా రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నప్పటికీ ఉపాధి అవకాశాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్న చందంగా ఉన్నాయని ఫార్మా ప్రతినిధులు ఆరోపించారు. ఫార్మా రెవెల్యూషన్ యాత్రలో భాగంగా ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. 1945లో రూ.10కోట్ల టర్నోవర్ ఉన్న ఫార్మారంగం ప్రస్తుతం రూ.1.20 లక్ష కోట్లకు చేరిందన్నారు. అయినా ఫార్మాసిస్ట్‌లకు తగిన ప్రాదాన్యం లేదని అన్నారు. 1945 సంవత్సరంలో తీసుకోచ్చిన చట్టాలే ఇప్పటికీ అమలు చేయడం ఈ రంగానికి అన్యాయం జరుగుతుందోన్నారు. దీనిపై చైతన్య పరిచేందుకు అమితవ్ జోయ్‌ప్రకాష్ చౌదరి నేతృత్వంలోని ఇండియా ఫార్మా రెవెల్యూషన్ పేరుతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యాత్ర చేపట్టినట్లు తెలిపారు.




