Tuesday, 3 November 2026

అదనపు వడ్డనపై ఆర్టీసీకి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌ : పండగ వేళల్లో బస్సు ఛార్జీలు పెంచి వసూలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్ధానం విచారణకు స్వీకరించింది.దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా ఆర్టీసీ, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ అనుసంధాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన మరో పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఆధార్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నందున జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *