Tuesday, 3 November 2026

వేళకాని వేళ అడ్డగోలు మాట


– విభజన తుపాన్‌ను అడ్డుకుంటా – సీఎం కిరణ్‌
శ్రీకాకుళం, అక్టోబర్‌ 20 (జనంసాక్షి):
వేళకాని వేళ సీఎం కిరణ్‌ అడ్డగోలు మాటలతో తన పక్ష పాత ధోరణిని బయటపెట్టుకున్నాడు. పైలిన్‌ తుపాను వల్ల నష్టాన్ని ఆపలేకపోయాం.. రాష్ట్ర విభజన తుపానును కచ్చి తంగా అడ్డుకునేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి అన్నా రు. సందర్భంగా కాకపోయినప్పటికీ ఒక్క విషయం మాత్రం చెబుతాను అంటూ పై విధంగా సీఎం వ్యాఖ్యానించారు. పైలిన్‌ తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఆదివారం పర్యటించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరులో పర్యటించారు. మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించారు. మత్స్యకారులకు మౌలికస దుపాయాలు కల్పించేందుకు, వారిని అదుకునేందుకుగాను 40కోట్ల రూపాయలను ఇస్తున్నట్టు ప్రకటించారు. మత్స్యకా రులకు డీజిల్‌ సబ్సిడీ కోసం యత్నిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కవిటి మండలం దేవుడిగుడితోటగ్రామంలో కొబ్బరి, జీడిమామిడి తోటల రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కొబ్బరి, జీడిమామిడి తోటల రైతులను ఆదుకుంటామని తెలిపారు. పైలాన్‌ తుపాను విషయం తెలియగానే సమ్మెలో ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో ఉద్యోగులు సహాయక కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొన్నారన్నారు. ప్రాణాపా యం జరక్కుండా అన్ని చర్యలు తీసుకున్నారన్నారు. రెండు జిల్లాల్లో మొత్తం లక్షా 35వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణాపాయం జరక్కుండా చర్యలు తీసుకున్నారన్నారు. అధికారులు, సిబ్బంది సహకరించడం వల్లే నష్టాన్ని కొంతమేరకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *