Tuesday, 3 November 2026

సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీకి సంపూర్ణ మద్దతిస్తాం : టీఆర్‌ఎస్‌ నేత కేకే

హైదరాబాద్‌ : సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కావాలన్న డిమాండ్‌పై తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కే.కేశవరావు అన్నారు. కానీ నష్టపరిహారం విషయానికి వస్తే తెలంగాణకే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమం తుఫాన్‌ కాదని ఉప్పెనని , దీన్ని అడ్డుకునేవారు కొట్టుకుపోతారని కేకే ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ధిక్కార స్వరం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కేబినేట్‌ నుంచి తెలంగాణ మంత్రులు బయటికి రావాలని కేకే సూచించారు. జగన్‌ సమైక్య సభ ప్రజల మధ్య విషబీజాలు నాటుతుందన్నారు. ఈ సభకు సీఎం పూర్తిగా సహాకరిస్తున్నారని ఆయన విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *