హైదరాబాద్ : ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందుతుందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ విశ్వాసం వ్యక్తం చేశారు.ఆర్టికల్ 371 (డి) విభజనకు ఆటంకం కాదన్నారు. దాని వల్లే తెలంగాణకు తీరని నష్టం జరిగిందన్నారు. సీమాంధ్ర నేతలు కొందరు ఆటంకవాదుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.




