Tuesday, 3 November 2026

ఈశాన్య రుతుపవనాల ఆగమనం : చెన్నైలో భారీ వర్షాలు

హైదరాబాద్‌ : ఈశాన్య రుతుపవనాల రాకతో చెన్నై నగరం ,చుట్టుపక్కల ప్రాంతాలు వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి పొద్దుపోయేవరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మళ్లీ సోమవారం ఉదయం వరకు వాన కురుస్తూనే ఉండడంతో చెన్నై కలెక్టరేట్‌ వర్గాలు ,పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించాయి. దీంతో నగర వాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆదివారం వారాంతం సెలవుదినం అయినా వర్షం కారణంగా యువత విహారాలకు బ్రేకుపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *