హైదరాబాద్ : విజయనగరంలో సిరిమాను జాతర ఉత్సవాలు అత్యంత వైభగంగా జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైనులో బారులు తీరారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు ఘాటాల్ని అమ్మవారి ప్రతిరూపంగా భావించి ,వారు తీసుకొచ్చిన ఘటాలను అమ్మవారికి చూపించి మొక్కులు చెల్లించుకుంటారు.




