Wednesday, 4 November 2026

రాష్ట్రాల ఏర్పాటు బాధ్యత కేంద్రానిదే : టీఆర్‌ఎస్‌ నేత ఈటెల

హైదరాబాద్‌ : కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ తెలిపారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కిరణ్‌కు చట్టాలపై అవగాహన లేదని విమర్శించారు. కిరణ్‌ ముఖ్యమంత్రి పదవిలో ఉండి బాధ్యరాహిత్యంగా మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కిరణ్‌కు చట్టాలపై అవగాహన లేదని విమర్శించారు. కిరణ్‌ ముఖ్యమంత్రి పదవిలో ఉండి భాద్యతారాహిత్యంగా మాట్లాడడం లేదని విమర్శించారు.కిరణ్‌కు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక హక్కు కిరణ్‌కుమార్‌రెడ్డి కోల్పోయారని చెప్పారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేసిన పార్టీలన్నీ ఇప్పుడు యూ టర్న్‌ టీసుకోవడం దారుణమన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించకపోవడం వల్లే నష్టం జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణలో విద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మించకపోవడంతో ఇక్కడి బిడ్డలు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *