Wednesday, 4 November 2026

రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్న ఈశాన్య రుతుపవనాలు

విశాఖ : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడంతో …ఈశాన్య రుతుపవనాలు చురగ్గా కదులుతున్నాయి. ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో 24గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై అల్పపీడన ప్రభావం పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50 కి.మీ వేగంతో ఈశాన్య దిశ నుంచి బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధిరారులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *