Tuesday, 3 November 2026

రాష్ట్రంలో మరో గంటలపాటు అల్పపీడన ప్రభావం

హైదరాబాద్‌ : అల్పపీడనం క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించి బలహీనపడే అవకాశం ఉందని ,మరో 24గంటల పాటు రాష్ట్రంపై దీని ప్రభావం ఉంటుందని విశాఖ తుపాన్‌ హెచ్చరికల కేంద్రం తెలిపింది. సీమాంధ్రలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్ర , రాయలసీమ సహా తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విశాఖ తుపాన్‌ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *