Tuesday, 3 November 2026

మూడో విడత రచ్చబండ తేదీలు ఖరారు

హైదరాబాద్‌ : ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు ప్రభుత్వం మూడో విడత రచ్చబండ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మినారాయణ రచ్చబండ తేదీలను ఖరారు చేశామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్‌ 6 నుంచి 24 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అయితే ఎక్కడి నుంచి రచ్చబండను ప్రారంభించేది తర్వాత తెలుపుతామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *