హైదరాబాద్ : రాయలసీమ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనం క్రమంగా ఈశాన్య దిశవైపు కదిలే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రాష్త్రంలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాలపై అల్పపీడన ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది.




